karpoora haaratulivvaramma ||aarabhi raagaM||
karpoora haaratulivvaramma gauri SaMbhulaku
naerputO kOri koluvaramma
sarpa bhooshaNuDu rudhraakshapaeruLa vaaDu
nityamu gaMganu Siramuna taraguNa chaesina satipati kanugoni
karpoora haaratulivvaramma
maMdaara dharuDOyamma iMdumukhitO
naMdi vaahanaaruduDOyamma
suMdara vadanulaMta vaMdanaMbulu saeya maMdaara virulu jalli
aMdamululalaragaa poojalu chaeyuchu
karpoora haaratulivvaramma
paarvati ramaNuDOyamma parvata sutanu pariNayamaaDe Oyamma
phaalaagni naetramuna paaliMcha jagamulella bhaaguganaelinaTTee paarvati malleSvarulaku
karpoora haaratulivvaramma
కర్పూర హారతులివ్వరమ్మ ||ఆరభి రాగం||
కర్పూర హారతులివ్వరమ్మ గౌరి శంభులకు
నేర్పుతో కోరి కొలువరమ్మ
సర్ప భూషణుడు రుధ్రాక్షపేరుళ వాడు
నిత్యము గంగను శిరమున తరగుణ చేసిన సతిపతి కనుగొని
కర్పూర హారతులివ్వరమ్మ
మందార ధరుడోయమ్మ ఇందుముఖితో
నంది వాహనారుదుడోయమ్మ
సుందర వదనులంత వందనంబులు సేయ మందార విరులు జల్లి
అందములులలరగా పూజలు చేయుచు
కర్పూర హారతులివ్వరమ్మ
పార్వతి రమణుడోయమ్మ పర్వత సుతను పరిణయమాడె ఓయమ్మ
ఫాలాగ్ని నేత్రమున పాలించ జగములెల్ల భాగుగనేలినట్టీ పార్వతి మల్లెశ్వరులకు
కర్పూర హారతులివ్వరమ్మ
No comments:
Post a Comment