Thursday, July 21, 2011

Shree lalitha siva Jyothi - mangaLam

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.


శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.


జగముల చిరు నగముల పరిపాలించే జననీ,

అనయము మము కనికరమున కాపాడే జననీ,

మనసే నీ వాసమై, స్మరణే జీవనమై,

మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ దాయిని. ||1||


శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.


అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,

అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి,

రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి,

సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి. ||2||


శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

No comments:

Post a Comment